చంద్రబాబు రేవంత్ రెడ్డి భారీ ప్లాన్..

చంద్రబాబు రేవంత్ రెడ్డి భారీ ప్లాన్..

0
102

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలు కలిసి భారీ ప్లాన్ వేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీ మేధావులు…. అధికార టీఆర్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి హుజూర్ నగర్ ఉపఎన్నికలు కీలకం… ఈ ఎన్నికల్లో గెలవటం ప్రెస్టేజ్ గా భావిస్తున్నారు ఇరు పార్టీల నాయకులు..

కాబట్టి ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి.,.. ఇక టీడీపీ బీజేపీలో పోటీకి దిగినప్పటికీ పెద్దగా ప్రభావం ఉండదు కానీ ఇక్కడ ట్విస్ట్ ఎంటంటే టీడీపీ తరపున క్యాండిడెట్ నిలబెట్టండం అందరికి అనుమానం కలుగుతోందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నారు.. ఉత్తమ్ భార్యను ఓడించాలనే ఉద్దేశంతో టీడీపీ తరపున అభ్యర్థిని పోటీకి దింపిందని అంటున్నారు….

అభ్యర్థిని దింపితే చంద్రబాబుకు ఏంటి లాభం అని అంటున్నారు… తాజా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని ఓడిస్తే రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి వరిస్తుందని భావిస్తున్నారట. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి వస్తే కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు చక్రం తిప్పాలని చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు… మరి చూడాలి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలో ఎంతమేరకు నిజం దాగి ఉందో