చంద్రబాబు సరికొత్త ప్లాన్- అందుకే రంగంలోకి రామయ్య

చంద్రబాబు సరికొత్త ప్లాన్- అందుకే రంగంలోకి రామయ్య

0
81

ఏపీలో నాలుగు రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి, అయితే ఈ సమయంలో తెలుగుదేశం కూడా వర్లరామయ్యని రంగంలోకి దింపింది, అసలు ఉన్నా నాలుగు సీట్లు వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి.. ఈ సమయంలో తెలుగుదేశం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనేది పెద్ద చర్చ.

అయితే దీని వెనుక బాబు సరికొత్త ఆలోచన ఉంది అంటున్నారు, అసలు మన పార్టీ నుంచి ముగ్గురు వెళ్లిపోయారు ..ఇక ఉంది 20 మంది అందులో టీడీపీ వెనుక ఉన్న వారు ఎవరు అనేది తెలుసుకోవాలి అని చూస్తున్నారు. ఈ సమయంలో విప్ జారీ చేసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేలా ఎమ్మెల్యేలకి కొత్త కండిషన్ పెడతారట.

ఈ సమయంలో మన పార్టీలో లేకుండా వైసీపీకి సపోర్ట్ చేసేవారు ఎవరో తెలుస్తుంది అని భావిస్తున్నారట, ఈ విషయంలో ఎవరైతే తెలుగుదేశం ఎంపీ అభ్యర్దికి ఓటు వేయలేదో వారిపై చర్యలు తీసుకుంటారట. వారిపై అనర్హత వేటు వేయాలి అని చూస్తున్నారట, ఇది పొలిటికల్ కారిడార్లో టాక్.