చంద్రబాబుకు మరో బిగ్ షాక్… గల్లా అరుణకుమారి గుడ్ బై….

చంద్రబాబుకు మరో బిగ్ షాక్... గల్లా అరుణకుమారి గుడ్ బై....

0
90

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు చంద్రబాబు సైకిల్ ను రిపేర్ చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సిద్దం చేయాలని చూస్తున్నారు… అయితే తమ్ముళ్లు మాత్రం ఆ సైకిల్ ను తొక్కలేక ఫ్యాన్ కింద రెస్ట్ తీసుకోవాలని చూస్తున్నారు…

ఇప్పటికే చాలామంది మాజీలు సీనియర్ నేతలు వైసీపీ తీర్ధం తీసుకున్నారు.. ఇక పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి రెబల్ గా మారి వైసీపీకి మద్దతు ప్రకటించారు… ఇక ఈ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోక ముందే ఆయనకు మరో బిగ్ షాక్ తగిలింది… ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పొలిట్ బ్యూరోకు గుడ్ బై చెప్పారు…

ఈ మేరకు ఆమె లేఖ కూడా విడుదల చేశారు… వ్యక్తిగత కారణాలతో టీడీపీ పొలిట్ బ్యూరో నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు… గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ హయాంలో మంత్రిగా ఉన్న గల్లా అరుణ కుమారి 2014 ఎన్నికల సమయంలో తన కుమారుడుతో కలిసి టీడీపీ తీర్ధం తీసుకున్న సంగతి తెలిసిందే..