టీడీపీకి మరో నాయకుడు మోసం వదలనంటున్న బాబు

టీడీపీకి మరో నాయకుడు మోసం వదలనంటున్న బాబు

0
107

వైసీపీలోకి మరో కీలక నేత చేరుతున్నారు అని తెలుస్తోంది ..126 మందితో తొలి జాబితా విడుదల చేసిన చంద్రబాబుని రాజకీయంగా దెబ్బ కొట్టాలి అని భావిస్తున్నారట ఓ కీలక నేత..నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్రెడ్డి పేరును గతంలో సీఎం చంద్రబాబు ముందే తెలియచేశారు. అయితే ఆదాల టీడీపీకీ గుడ్బై చెప్పి వైసీపీ గూటికి వెళ్తారని తెలుస్తోంది. ఇక ఆయనకు వైసీపీలో నెల్లూరు ఎంపీ సెగ్మెంట్ ఇచ్చే అవకావం ఉంది అని సమాచారం. అయితే ఆదాల రాజకీయంగా ఎంత పేరు తెచ్చుకున్నారో వ్యాపార పరంగా అంతేపేరు తెచ్చుకున్నారు. ఇక టీడీపీ టికెట్ పొందిన ఆయన , వెంటనే ఆయనకు రావాలసిన బిల్లులు సుమారు 43 కోట్ల రూపాయలకు క్లియరెన్స్ తెప్పించుకున్నారు అని తెలుస్తోంది. ఇక కంపెనీలకు సంబంధించిన డబ్బులు 43 కోట్లు ఖాతాలో రాగానే ఆయన ప్రచారం ఆపివేసి అమరావతికి బయలుదేరారు అని అంటున్నారు.

ఆదాల పార్టీ ఫిరాయించారని, వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం వైసీపీ వర్గాల నుంచే మొదలైంది. దీంతో వెంటనే టీడీపీ నేతలు ఆయనకు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదట..ఇక ఆదాల వైసీపీలోకి నేడు లేదా రేపు చేరే ఆలోచనలో ఉన్నారట, సో ఇలా కనుక చేస్తే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఆసెగ్మెంట్లో తీసుకుంటారు అని చెబుతున్నారు టీడీపీ నేతలు.