11 మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు షాక్

11 మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు షాక్

0
144

వైసీపీ నుంచి సీటు ఆశించారు వీరందరూ, జగన్ సీటు ఇచ్చారు.. కాని పార్టీ తరపున గెలిచి 2014 నుంచి ఒక్కొక్కరుగా ఇలా 21 మంది పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలోకి జంప్ అయ్యారు.. కట్ చేస్తే ఇప్పుడు 2019 ఎన్నికలు ఇలా ఫిరాయింపు అనే ట్యాగ్ లైన్ ఉన్నవారికి సీట్లు టిక్కెట్లు ఇస్తే పార్టీకి గతి మారుతుంది అని బాబు ఆలోచించి పార్టీ మారిన వారిలో కాస్త స్ట్రాంగ్ లీడర్లను మినహా, మిగిలిన వారిని పక్కన పెట్టారు. అందుకే ఇప్పుడు ఈ పార్టీ మారిన నేతలు టికెట్ పై ఆశలు పెట్టుకున్నా టికెట్ వచ్చే అవకాశం లేదు అంటున్నారు. మరి వారి లిస్ట్ ఇదేనట.

పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ
పాడేరు–గిడ్డి ఈశ్వరి
రంపచోడవరం– వంతల రాజేశ్వరి
ప్రత్తిపాడు– వరుపుల సుబ్బారావు
విజయవాడ పశ్చిమ– జలీల్ఖాన్
యర్రగొండపాలెం– డేవిడ్రాజు
శ్రీశైలం– బుడ్డా రాజశేఖర్రెడ్డి
కోడుమూరు– మణిగాంధీ
కదిరి– చాంద్ బాషా
బద్వేలు– జయరాములు
కర్నూలు- ఎస్వీమోహన్ రెడ్డి
పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన

వీరికి ఈసారి టిడీపీ తరపున టికెట్ ఇచ్చే అవకాశం లేదు అని అంటున్నారు .మరి వీరిస్ధానంలో ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి అనేది కూడా తెలుసుకుందాం..పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి స్థానంలో మాజీ మంత్రి మణికుమారి, బొర్రా నాగరాజుల పేర్లను పరిశీలిస్తున్నారు.వంతల రాజేశ్వరి బదులు చిన్నం బాబూరావు, సీతంశెట్టి వెంకటేశ్వరరావు పేర్లు చంద్రబాబు పరిశీలిస్తున్నారట. జలీల్ఖాన్ స్థానంలో ఆయన కుమార్తెకు సీటు ఇచ్చేఆలోచనలో ఉన్నా మరికొందరు మైనార్టీ నేతలు మాత్రం అడ్డుపడుతున్నారు..వరుపుల సుబ్బారావు స్థానంలో ఆయన కుటుంబంలోని మరొకరికి సీటుఇస్తారు అని ప్రచారం జరుగుతోంది.

బుడ్డా రాజశేఖర్రెడ్డి స్ధానంలో ఏరాసు ప్రతాప్రెడ్డిని రేసులోకి తీసుకొచ్చారు. మణిగాంధీ ప్లేస్ లో సెర్చింగ్ జరుగుతోంది అభ్యర్దికోసం. .చాంద్బాషా స్థానంలో ఆయన చేతిలో ఓడిపోయిన కందిగుంట ప్రసాద్ కు మాత్రమే సీటు ఇస్తాను అన్నారట.. జగన్ పాదయాత్ర సమయంలోనే ఇక్కడ తెలుగుదేశం అధినేత ఫిక్స్ అయ్యారు..ఉప్పులేటి కల్పన స్థానంలో డీవై దాసు, వర్ల రామయ్య పేర్లను పరిశీలిస్తున్నారు.ఇక వీరు అందరూ కూడా ఇప్పుడు జగన్ వైపు ఆశగా చూస్తున్నారట. కాని ఇలా ఫిరాయించిన వారిని మళ్లీ తీసుకుంటే ఎలాంటి పరిస్దితి వస్తుందో జగన్ కు తెలుసు సో అందుకే ఆచితూచి జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.