తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఫలితాలు రావడానికి ఇంకా చాలా సమయం ఉండటంతో అసెంబ్లీ అభ్యర్దులు పార్లమెంట్ అభ్యర్దులతో రివ్యూ మీటింగ్ జరుపుతున్నారు.. అలాగే ఎక్కడెక్కడ పోలింగ్ ఎలా జరిగింది ఫలితాలు ఎలా రానున్నాయి అని పోలింగ్ సరళి బట్టి తెలుసుకుంటున్నారు చంద్రబాబు.. ఇక గ్రామాలలో వార్డుల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ స్దాయిల్లో ఎవరు ఎలా పనిచేశారు, పార్టీకి నిబద్దులు ఎవరు, వెన్నుపోటు పొడిచిన కట్టప్పలు ఎవరు అనేది కూడా ఇప్పటికే లిస్ట్ తెప్పించుకున్నారట చంద్రబాబు.. ఫలితాలు ఆ ప్రాంతంలో రివర్స్ అయితే కచ్చితంగా వారిపై వేటు వేయడం జరుగుతుంది అని చెబుతున్నారు..
అలాగే మరోవైపు పార్టీ గెలుపు కోసం కష్టించి పనిచేసే వారికి సముచిత స్థానం కల్పించడం, వచ్చే ఎన్నికల్లో వారికి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, చైర్పర్సన్ పదవుల సీట్లతో పాటు కేడర్ బట్టి ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు కూడా కట్టబెట్టేందుకు టీడీపీ అధిష్టానం యోచిస్తోంది. అందుకే ఫలితాల రాకముందే అన్ని పోలింగ్ బూత్ లలో ఎవరు ఎలా పనిచేశారు అనే విషయాలు అన్ని తెలుసుకుంటున్నారు చంద్రబాబు.