నెల్లూరు జిల్లాలో చంద్రబాబుకు కొత్త టెన్షన్…

నెల్లూరు జిల్లాలో చంద్రబాబుకు కొత్త టెన్షన్...

0
129

నెల్లూరు జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో రోజురోజుకు నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి… 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది జిల్లాలో… అయితే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు జిల్లాలో పట్టు సాధించాలని అనేక విశ్వప్రయత్నాలు చేస్తున్నారు… అయితే తమ్ముళ్లు మాత్రం అందుకు ఏమాత్రం సహకరించకున్నారు… రెండు వర్గాలుగా విడిపోయి ఆధిపత్యంకోసం ప్రయత్నిస్తున్నారు…

తాజాగా మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్దన్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీదా రవిచంద్రవర్గాల మధ్య పోరు ఇటీవలే బహీర్గతం అయింది… కావలి నియోజకర్గంలో టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న విష్ణువర్దన్ రెడ్డి వర్గీయుడైన అప్పల కళ్యాణచక్రవర్తి ఉరఫ్ బాబీ పై జిల్లా తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది… చేజర్ల వెంకటేశ్వరరెడ్డి పేరుతో బాబీ ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూప్రకటన విడుదల చేసింది…

కావలిలో నివురు గప్పిన నిప్పుపై ఈ ప్రకటన ఆజ్యం పోసినట్లు అయింది..దీంతో రెండు కుంపట్లు రాజుకున్నాయి.. ఒక వర్గం ఇంచార్జ్ విష్ణువర్దన్ రెడ్డి కి తెలియపరచకుండా సస్పెండ్ వేటు ఏమిటని వాదిస్తుండగా బీద రవిచంద్ర కు అనుకూలంగా ఉండే వర్గం పార్టీలో క్రమశిక్షణ తప్పిన వారికి ఇంతే జరుగుతుందన్న వినిపిస్తుంది… అయితే ఈ వివాదం ఇప్పట్లో సర్దుకునేటట్లు కనిపించలేదు… మరి అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి…