చంద్రబాబు విప్ జారీ చేసేంత మగాడివా… రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే

చంద్రబాబు విప్ జారీ చేసేంత మగాడివా... రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే

0
114

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు… చంద్రబాబు నాయుడు తనకు విప్ జారి చేసేంత మగాడా అని వాఖ్యానించారు… విప్ జారీ చేయడానికి చంద్రబాబు వద్ద ఏముందని ఉడకబెట్టిన నాగడి దుంప అని ఎద్దేవా చేశారు…

టీడీపీ నుంచి తనను బహిస్కరించారని తనను స్పీకర్ ప్రత్యేక సభ్యుడుగా చూస్తున్నారని అన్నారు… తనను తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేశారని తనకు ఎలా విప్ జారీ చేస్తారని ఆరోపిచారు… చంద్రబాబు పక్క చందాలన మాట విన పార్టీని నాశనం చేస్తున్నారని ఇదే విషయాన్ని తాను గతంలో కూడా చెప్పానని వంశీ అన్నారు…

రాజ్యసభ సీటు గెలిచే అవకాశం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వ్యాపార వేత్తలకు అవకాశం ఇచ్చారని అవకాశం లేని సమయంలో మాత్రం దళితుడుని రంగంలోకి దించారని ఆరోపించారు… అలాగే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారని ఆన్నారు…