గ్రామ వాలంటీర్లకు చంద్రబాబు కబడ్దార్ అంటూ సీరియస్ వార్నింగ్

గ్రామ వాలంటీర్లకు చంద్రబాబు కబడ్దార్ అంటూ సీరియస్ వార్నింగ్

0
93

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అలాగే..ఇటీవలే గ్రామ వాలంటీర్ గా నియమితులు అయిన అభ్యర్థులపై నిప్పులు చెరిగారు… ప్రజలపై ఇష్టాను సారం ప్రవర్తిస్తే ఊరుకోమని అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు…

తాజాగా ఆయన మీడియతో మాట్లాడుతూ… ఓ మహిళ పట్ల గ్రామ వాలంటీర్ ప్రవర్తించిన తీరు బాధకరమని అన్నారు… చివరికి ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవడం వరకు వచ్చిందని అన్నారు… అసలు వైసీపీ కార్యకర్తలు గ్రామ వాలంటీర్ గా కావాలని ఎవరు అడిగారని ఐదువేలు రూపాయలతో ఏం ఉద్యోగం అది గోనే సంచులు మోసే ఉద్యోగం అని చంద్రబాబు నాయుడు అన్నారు..

వాలంటీర్ శాశ్వితం కాదు. వైసీపీ ప్రభుత్వం శాశ్వితం కాదు రాష్ట్రం పర్మినెంట్ అని అన్నారు మీరు చేసే పని మీరు చేయండి అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు