చంద్రబాబునా మజాకా… మోడీ స్నేహం కోసం బ్రహ్మాస్త్రం

చంద్రబాబునా మజాకా... మోడీ స్నేహం కోసం బ్రహ్మాస్త్రం

0
106

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీతో మరోసారి స్నేహానికి ప్రయత్నిస్తున్నారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు బీజేపీకి కటీఫ్ చెప్పి కాంగ్రెస్ తో ధర్మపోటారాటం చేశారు..

అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ తోపాటు ఇటు ఏపీలో టీడీపీ కూడా ఘోరంగా ఓటమి చెందింది…. ఇప్పుడు టీడీపీ శత్రుత్వాన్ని విడనాడి మచ్చిక చేసుకునే దిశగా మొదలు పెట్టిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు… ఈ క్రమంలో టీడీపీ అధిష్టానం తమకున్న పరిచయాలతో బీజేపీతో స్నేహం చేయాలని చూస్తోందట…

2019 ఎన్నికల్లో పార్టీ సిద్దాంతాలను పక్కన పెట్టి మరీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగారు… కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో కలిసి చేసిన ప్రచారం అందరికి తెలిసిందే… అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని వదిలి దుమ్మెత్తి పోసిన బీజేపీతో చెలిమి చేసేందుకు సిద్దమవుతోందని అంటున్నారు..

మరి టీడీపీ పుస్తకాన్ని పూర్తిగా చదివేసిన బీజేపీ చెలిమికి ఒకే అంటుందా లేదా అనేది చూడాలి… మరో వైపు రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితిల్లో టీడీపీతో పొత్తు ఉండదని చెబుతున్నారు…