చంద్రబాబు హయాంలో అన్యాయం జరిగిన రైతులను ఆదుకుంటాం..!!

చంద్రబాబు హయాంలో అన్యాయం జరిగిన రైతులను ఆదుకుంటాం..!!

0
83

టీడీపీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యం చెప్పారు. అనంతపురం, గురజాల, ప్రకాశం, నరసరావుపేట, వినుకొండల్లో పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని… ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. పార్టీ కార్యకర్తల రక్షణ కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉండవల్లిలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో తన కంటే ఎక్కువగా ఎమ్మెల్యేలు గొంతుక వినిపించాలని చంద్రబాబు చెప్పారు. టీడీపీ హయాంలో అమలుచేసిన రైతు రుణమాఫీ 4, 5 విడతలను చెల్లించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వానిదేనని అన్నారు. వైయస్ చేపట్టిన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేశామని… మిగిలిన ప్రాజెక్టులు చివరి స్టేజిలో ఉన్నాయని చెప్పారు. అలాంటి ప్రాజెక్టులను ఇప్పుడు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. చెప్పుడు మాటలు వినడం, టీడీపీపై బురద చల్లడమే వైసీపీ సూత్రమని విమర్శించారు.