పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ

పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ

0
87

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ మధ్యాహ్నం అమరావతిలోని తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కిమిడి కళావెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమ, గల్లా జయదేవ్, కేశినేని నాని, మరికొందరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై ఈ సందర్భంగా చర్చించారు.

ముఖ్యంగా పార్టీ భవిష్యత్తుపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ప్రతి ఒక్కరి నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? క్షేత్రస్థాయి నుంచి టీడీపీని ఎలా పునర్నిర్మించుకోవాలి? అనేదానిపై చంద్రబాబు ముఖ్యనేతలతో మాట్లాడారు. మరికొన్నిరోజుల్లో చంద్రబాబు తన కుటుంబంతో విదేశాలకు వెళుతున్న నేపథ్యంలో పార్టీ కార్యాచరణను కూడా ఆయన ఇతర నేతలకు తెలియజేశారు.