ఏపీకి ఓ శాపం.. వైసిపి వంద రోజుల పాలన

ఏపీకి ఓ శాపం.. వైసిపి వంద రోజుల పాలన

0
83

వైసిపి వంద రోజుల పాలన ఏపీకి శాపంగా మారిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. వంద రోజుల పాలన లో ఏ ఒక్క అభివృద్ధి పనులు చేపట్టడం లేదని విమర్శించారు. పోలవరం భద్రతతో ఆటలు ఆడుతున్నారని, రేపు పోలవరానికి ఏమైనా జరిగితే గోదావరి జిల్లాలో ఏమవుతాయి అని ప్రశ్నించారు.
పారిశ్రామికవేత్తల తోనే ఏపీ లో ఉన్నది తీవ్రవాద ప్రభుత్వం అనేలా చేశారని విమర్శించారు.

తోట త్రిమూర్తులు పార్టీని వీడే విషయం తన దృష్టికి కి రాలేదు అన్నారు సొంత లాభాల కోసం పార్టీని మారుతూ తన పై నిందలు వేయడం సరికాదని తెలిపారు. ఒకరిద్దరు నేతలు పార్టీ మారినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని టిడిపి పటిష్టంగా ఉందని ఈ సందర్భంగా గా ఆయన స్పష్టం చేశారు.