చిక్కుల్లో టీడీపీ ఫైర్ బ్రాండ్… నోరు తెచ్చిన తంటా….

చిక్కుల్లో టీడీపీ ఫైర్ బ్రాండ్... నోరు తెచ్చిన తంటా....

0
95
ayyanna patrudu

చింతకాయల అయ్యన్న పాత్రుడు పేరు చెప్పగానే టీడీపీలో ఉన్న అతికొద్ది మంది ఫైర్ బ్రాండ్ లో ఒకరుగా పేరుంది… పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు నిప్పు రాజేసేవిగానే ఉంటాయన్నది అందరికి తెలిసిందే… అయ్యన్నకు చిర్రెత్తికొస్తే తన పరఏమి ఉండవన్న తీరు గమనించేవారందరికీ సుపరిచితమే… తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం నుంచి జెండా మోసిన అతికొద్దిమందిలో అయ్యన్న పాత్రుడు కూడా ఒకరు…

అందుకే పార్టీ అధిష్టానం ఆచితూచి చర్యలు తీసుకోవడానికి వెనకాడుతూ ఉంటుంది… తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ తో టీడీపీ దోస్తీ చేస్తే ప్రజలు చెప్పులతో కొడతారని సంచలన వ్యాఖ్యలు చేసిన అయ్యన్న ఇటీవలే డాక్టర్ సుధాకర్ విషయంలో ను సీఎం జగన్ పై అలాగే పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు… అలాంటి ఫైర్ బ్రాండ్ ఎప్పుడు చిక్కుతారా అని అధికార వైసీపీ ఎదురు చూస్తోంది… అయితే వారి ఆశలను అడిశాలు కాకుండా అయ్యన్న తొందరగానే చిక్కారు…

నర్సీపట్నం కమీషనర్ పై అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు… ఆయ వ్యవహరించిన తీరు నిర్భయ దిశా చట్టం పరిధిలోకి వచ్చేలా ఉన్నాయని కేసు నమోదు చేశారు పోలీసులు ఇదే కాకుండా నగరంలో కొన్ని వివాదాస్పద వ్యవహారాల్లో చిక్కుకోవడంతో మరో మూడు కేసులు ఆయన పై నమోదు అయ్యాయి… ఈ కేసులు ఎలా ఉన్నా దిశా నిర్భయా వంటి కేసులు మాజీ మంత్రిపై నమోదు కావడం ఇప్పటివరకు జరగలేదు…