అలా అనేవారిని చెప్పుతీసుకు కొడతా యామిని

అలా అనేవారిని చెప్పుతీసుకు కొడతా యామిని

0
93

తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత సాధినేని యామిని ఎక్కడా పెద్ద కనిపించడం లేదు.. అయితే తెలుగుదేశం ఉమెన్ వింగ్ లో ఆమె కీలకంగా ఉండేవారు ..కాని ఇఫ్పుడు పార్టీ ఓటమితో నేతలు అందరూ వరస పెట్టి వేరే పార్టీలు చూస్తున్నారు. తాజాగా యామిని పలు విషయాలు మీడియాతో చర్చించారు.పవన్ కళ్యాణ్ పై ఎన్నికల ముందు చేసిన వ్యాఖ్యలతో తనని చాలామంది మల్లెపూల యామిని అంటూ పిలిచారని. తన ఆవేదనని వ్యక్తం చేశారు.

తన మాటలు వక్రీకరించారని తాను ఒకటి చెప్పాలని అనుకుంటే మరొకటి చెప్పాను అని, అలా తప్పుగా మాట్లాడిన వారిని చెప్పుతో
కొట్టాలనిపించింది అని చెప్పారు ఆమె. ఇక తాను వైసీపీలో చేరేందుకు బాగా ప్రయత్నించా అని, తను పదే పదే వైసీపీ కోసం పాకులాడాను అని వార్తలు వచ్చాయి. కాని ఇందులో వాస్తవం లేదు అని ఆమె తెలియచేశారు.

తాను వైసీపీలో చేరాలి అని అనుకోలేదు. నేను వారితో మాట్లాడలేదు, వారు నాతో చర్చించలేదు. నేను వైసీపీలో చేరను అని ఆమె క్లారిటీ ఇచ్చారు…మొత్తానికి మల్లెపూల యామిని అని తనపై కామెంట్లు చేసిన వారికి ఆరోజు ఆమె గట్టి వార్నింగ్ ఇచ్చారు అనేది తెలిసిందే. తాను ఎంపీ ఎమ్మెల్యే సీటు కోసం ఏ పార్టీ లో చేరను అని తెలియచేశారు.