చీరాలలో టీడీపీ ఇంచార్జ్ ఎవరంటే…

చీరాలలో టీడీపీ ఇంచార్జ్ ఎవరంటే...

0
85

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు… తాజాగా టీడీపీ చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే…

వైసీపీలో చేరేందుకు ఆయన తన అనుచరులతో బయలు దేరారు…దీంతో చంద్రబాబు నాయుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చీరాల నియోజకవర్గం ఇంచార్జ్ ను నియమించారు.. జిల్లా పరిణామాలపై చర్చించి ఆయన చీరాల ఇంచార్జ్ గా యడం బాలాజీని నియమించారు,..

ఈ మేరకు మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర బాబు ఒక ప్రకటన కూడా చేశారు… చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యడం బాలాజీని చీరాల ఇంచార్జ్ గా నియమించామని స్పష్టం చేశారు…