మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవికి టిఆర్ఎస్ ఎమ్మెల్యే వేధింపులు

0
321

హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీలో సొంత పార్టీ ఎమ్మెల్యేపై కార్పొరేటర్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తెలంగాణ స్వరాష్ట్రంలో తొలి హైదబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి ఈ తిరుగుబాటు చేయడం గమనార్హం. ఆమె ఎందుకు తిరుగుబాటు చేశారు? సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఆమె ఏరకమైన ఆరోపనలు చేశారు..? చదవండి.

చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అయిన నేను మీడియా మిత్రులకు తెలియజేయునది ఏమనగా…

చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ గా గెలుపొందిన నాటి నుంచి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి నాపై తరచుగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు. దీనిని మీడియా సోదరులు మీ అందరితో పాటు డివిజన్ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మహిళ కార్పొరేటర్ అన్న గౌరవం కానీ సానుభూతి గానీ లేకుండా ప్రతి చోట నన్ను అవమానపరుస్తూ నే ఉన్నాడు. అయినా భరిస్తూ వచ్చాను. ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నా భర్త మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అధిష్టానం నిర్ణయం మేరకు తప్పుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే.

Uppal MLA Bethi Subash Reddy with KCR

నా భర్తను సాధించలేక నాటి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని మహిళనని కూడా చూడకుండా ఏదో రకంగా నన్ను నిత్యం ఇబ్బందులకు గురి చేస్తూ అవమానపరుస్తూ నే ఉన్నాడు. డివిజన్ లో నా ఓటమి కోసం పనిచేసిన కొంతమందిని చేరదీసి వారిని నాపైకి ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నాడు. డివిజన్ కార్పొరేటర్ గా నాకు కనీస సమాచారం లేకుండానే డివిజన్లో అభివృద్ధి పనుల పరిశీలనలను సమస్యల పరిశీలనలు చేస్తూ అధికారులను పార్టీ శ్రేణులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలకు నిర్ణయించిన సమయానికి రాకుండా తన ఇష్టం వచ్చిన సమయంలో వచ్చి నేను లేకుండానే ప్రారంభోత్సవాలు చేసి అవమాన పరుస్తాడు.

ఉప్పల్ నియోజకవర్గంలో ఏ డివిజన్ లోనూ తలెత్తిన సమస్యలు చర్లపల్లి లోనే ఎందుకు తలెత్తుతున్నాయి మీడియా సోదరులు గమనించాలి. అన్ని డివిజన్ల కార్పోరేటర్ లను కలుపుకొని పని చేస్తున్న ఎమ్మెల్యే మహిళను అన్న సానుభూతి లేకుండా నాపై కుట్రలు పన్నుతూ కక్షపూరితంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి. తొందరపడవద్దు అన్నీ సర్దుకుంటాయని ఓపిక పట్టినప్పటికీ ఏలాంటి హోదా లేని వ్యక్తులు ఎమ్మెల్యే అండతో నన్ను ఇరుకున పెట్టే చర్యలకు పాల్పడుతున్నారు. ఇక ఈ విషయాలను పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. నాకు జరిగిన అవమానాలు నాపై చేస్తున్న కుట్రలను మంత్రి కేటీఆర్ దృష్టికి నేరుగా తీసుకెళ్లాలని భావిస్తున్నాను.

charlapally corporator bonthu sridevi

మచ్చుగా మీ అవగాహన కోసం…

ఈరోజు నేను నాగార్జున నగర్ కాలనీ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఉండగానే నాకు కనీస సమాచారం లేకుండా చర్లపల్లి లో సీఎం క్షీరాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వెళ్లారు. ఈ కార్యక్రమంపై డివిజన్ కార్పొరేటర్ గా నాకు కనీస సమాచారం లేదు.

చర్లపల్లి బస్తీ దవాఖాన లో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు మేయర్ వస్తున్న విషయం తెలిసిన ఏలాంటి హోదా లేని ఎమ్మెల్యే అనుచరులు బస్తి దావకానలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించి మేయర్ ను అవమాన పరిచిన విషయం మీ అందరికీ తెలిసింది.

ఈసీ నగర్ లో గణేష్ టెంపుల్ షాపింగ్ కాంప్లెక్స్ 10 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా తొమ్మిదిన్నర గంటలకు నేను లేకుండానే ప్రారంభించి వెళ్ళాడు మేడం వస్తున్నారు సార్ అని నిర్వాహకులు చెప్పిన ఎవరికీ మేడం అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి ప్రారంభించి వెళ్ళాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకే మీ ముందుకు వచ్చాను… సోదరులుగా మీరంతా డివిజన్లో జరుగుతున్న పరిణామాలను గమనించాల్సింది గా కోరుతున్నాను..

ఇట్లు బొంతు శ్రీదేవి.