చైనాకి స‌రైన స‌మ‌యంలో బిగ్ షాకిచ్చిన బ్రిట‌న్

చైనాకి స‌రైన స‌మ‌యంలో బిగ్ షాకిచ్చిన బ్రిట‌న్

0
80
Chinese and British Relations Concept Image - Flags of China and the United Kingdom Fading Together

ఇంత దారుణ‌మైన స్దితిలో కూడా వ్యాపారకాంక్ష‌తో ఉంది చైనా.. అతి దారుణంగా ఇట‌లీ బ్రిట‌న్ అమెరికా ప‌రిస్దితి ఉంది, ఈ స‌మ‌యంలో మందులు స‌ప్లై ఉచితంగా అయినా చేయాలి లేక‌పోతే కాస్త ధ‌ర త‌గ్గించి అయినా ఎగుమ‌తి చేయాలి.. వైర‌స్ త‌గ్గేలా క్వాలిటీ మందులు ఎక్విప్ మెంట్ పంపాలి కాని అన్నీ నాశిర‌కం ఎగుమ‌తులు చేసింది చైనా.

దీంతో అన్నీ దేశాలు కూడా ఇప్పుడు చైనా పై మండిప‌డుతున్నాయి, తాము కుదుర్చుకున్న ఒప్పందాలు క్యాన్సిల్ చేసుకుంటున్నాయి, అంతేకాదు తిరిగి మా అడ్వాన్సులు ఇవ్వాలి అని కోరుతున్నాయి.
తాజాగా యూకేకు పనిచేయని పరీక్ష కిట్లను పంపింది చైనా. దీంతో చైనాపై యూకే ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది.

పని చేయని పరీక్ష కిట్లు పంపుతారా.. వెంట‌నే మా డబ్బు మాకు వాపస్‌ చేయండి అని నిలదీసింది. చైనాకు ఇచ్చిన ఆర్డ‌ర్లో కిట్లు అన్నీ నాశిర‌కం వ‌చ్చాయి, దీంతో అవి నెగిటీవ్ పాజిటీవ్ స‌రిగ్గా చూపించ‌డం లేదు అని తేలింది..మొత్తం 35 లక్షల కిట్లను చైనా సరఫరా చేసింది. వీటి మొత్తం న‌గ‌దు వెన‌క్కి పంపాలి అని కోరింది బ్రిట‌న్.