చైనాలో 3500 మ‌ర‌ణాలు కాదు సంచ‌ల‌న విష‌యం చెప్పిన ప‌త్రిక‌

చైనాలో 3500 మ‌ర‌ణాలు కాదు సంచ‌ల‌న విష‌యం చెప్పిన ప‌త్రిక

0
95

చైనాలో వుహ‌న్ లో పుట్టిన ఈ వైర‌స్ ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 198 దేశాల‌కు పాకేసింది, దీని తీవ్ర‌త మ‌రింత పెరుగుతోంది.. ఇప్పటికే 7 లక్షల మందికి సోకి, అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 23 వేల మందిని బలిగొంది. వైరస్ వెలుగు చూసిన చైనాలో మృతుల సంఖ్య 3,300 అని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది, కాని ఇది స‌రైన లెక్క కాదు అని చాలా మంది అంటున్నారు. ఇక్క‌డ ప్రముఖ పత్రిక కూడాదాదాపు 40 వేల మ‌ర‌ణాల పైనే ఉంటాయి అని అంటోంది.

ఇక్కడి మరణాల సంఖ్య 42 వేలకు పైనే ఉండచ్చని వూహాన్ స్థానిక ప్రజలు నమ్ముతున్నారు. చైనా చెబుతున్న మృతుల్లో 3,182 మంది హుబేయ్ ప్రావిన్స్ కు చెందిన వారే ఉన్నారు అని అంటున్నారు,
ఒక్కో చోట నుంచి రోజుకు 500 ఆస్థి కలశాలను వారి బంధువులకు ఇస్తున్నారట‌.

ఇక్క‌డ దాదాపు లాక్ డౌన్ ఉండ‌టంతో జ‌నాభా బ‌య‌ట‌కు రాలేదు.. కాని ఇప్పుడు ఇప్పుడే ఐదు కోట్ల మంది వ‌స్తున్నారు. ఇక్క‌డ సేవ‌లు ఇప్పుడు ప్రారంభం అయ్యాయి. ఇక ఈ న‌గ‌రం నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి బ‌య‌ట వారు ఇక్క‌డ‌కు రావ‌డానికి అవ‌కాశం లేదు, అయితే స‌గం మంది ఇళ్ల‌లోనే మ‌ర‌ణించి ఉంటార‌ని ఈ విష‌యాలు అన్నీ బ‌య‌ట‌కు కొద్ది రోజుల్లో వ‌స్తాయి అంటున్నారు.