కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో చైనా అతలాకుతలం అవుతోంది.. ఇప్పటికే దాదాపు 2300 మంది మరణించారు, ఇంకా లక్ష మందికి పైగా ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఇక దాదాపు 10 నగరాల్లో ఇంకా హెల్త్ ఎమెర్జెన్సీ విధించారు, ఇక చైనా నుంచి వేరే దేశానికి ఎవరూ వెళ్లడం లేదు, అలాగే చైనా కి వేరే దేశీయులు ఎవరూ రావడం లేదు.
దేశంలో నలువైపులా ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే చికిత్స అందిస్తున్నారు, పెద్ద సంఖ్యలో కరోనా అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వైరస్ వ్యాప్తిని నిరోధించాలని చైనా అధికారులు డాక్టర్లు పని చేస్తున్నారు.
ఇక చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది, ప్రజలు ఎవరైనా తమకు కరోనా సోకిందని భావిస్తే వారికై వారే స్వచ్ఛందంగా ముందుకు వస్తే, ఆ వైరస్ ఉందని తేలితే వారికి వెంటనే లక్ష రూపాయలు ఇవ్వనుంది , ఈ చికిత్స సమయంలో వారిని ప్రత్యేక వార్డుకి తరలిస్తారు.. వారి అకౌంట్లో నగదు జమచేస్తారు, అయితే ఇప్పటి వరకూ చికిత్స తీసుకున్న వారికి ఈ నగదు రాదట, కొత్త వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.