ఇప్పటికే దాయాదీ దేశం పాక్ తో ఎన్నో వివాదాలు సరిహద్దు సమస్యలు ..అయితే ఇప్పుడు నేపాల్ తో కూడా మనకు కొత్త తలనొప్పి, ఈ సమయంలో చైనా తో కూడా మళ్లీ విభేదాలు ప్రారంభం అయ్యాయి, మళ్లీ యుద్దమేఘాలు కమ్ముకుంటున్నాయి.
45 ఏళ్లుగా పెత్తనం కోసం చూస్తున్న చైనా తూర్పు లద్దాఖ్ లో భారత్ – చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరు..కాదు..ఇద్దరు..కాదు..20 మంది భారతీయ సైనికులను పొట్టనపెట్టుకుంది. మరో 10 మంది సైనికుల ఆచూకీ తెలియడం లేదు. మొత్తం ఈ గొడవలో 43 మంది సైనికులు చనిపోయారు అని తెలుస్తోంది.
రాళ్లు, ఇనుప కడ్డీలు, కర్రలతో పెట్రేగిపోయారు. ఫలితంగా అక్కడ ఇరు సైనికుల రక్తం చిందింది. ఈ దుశ్చర్యను భారత సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారు. దీంతో మన ఆర్మీ జవాన్లు ప్రాణాలు వదిలారు, ప్రత్యర్ది వైపు కూడా సైనికులు మరణించారు.తెలంగాణ వాసి సంతోష్ తో సహా..20 మంది సైనికులు వీరమరణం పొందారు.