చైనాలో వైరస్ పుట్టిన వుహాన్ లో ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా

చైనాలో వైరస్ పుట్టిన వుహాన్ లో ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా

0
100
China

ఈ ప్రపంచానికి కరోనా వైరస్ ని పరిచయం చేసింది చైనాలోని వుహాన్ పట్టణం, ఇక్కడే పుట్టి రెండున్నర కోట్ల మందికి సోకింది కరోనా వైరస్ , దాదాపు 110 దేశాలు అతలాకుతలం అయ్యాయి, డిసెంబరు నుంచి జూన్ వరకూ చైనా కూడా చాలా వరకూ లాక్ డౌన్ లో ఉంది.

గత రెండు నెలలుగా మళ్లీ అక్కడ కేసులు తగ్గడంతో, ఎవరి పనుల్లో వారు ఉన్నారు, అయితే మేజర్ కేసులు వుహాన్ లోనే విజృంభించాయి.వుహాన్ లోని ఫిష్ మార్కెట్ లో కరోనా వైరస్ మొదటగా వ్యాప్తి చెందింది , ఇక ఐదు నెలలు ఇంటి పట్టున ఉన్న జనం ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. వుహాన్ అధికారులు అన్ని ఆంక్షలను ఎత్తివేశారు.

దీంతో వుహాన్ లోని వాటర్ పార్కులన్ని జనం తో కిక్కిరిసి పోతున్నాయి… వేలమంది పార్టీల పేరుతో .. అక్కడి వాటర్ పార్కులకు పోటెత్తుతున్నారు.ఇప్పుడు ఈ జన కోలాహాలం ఫోటోలు వైరల్ అవుతున్నాయి, వేలాది మంది అక్కడ కనిపిస్తున్నారు,రెస్టారెంట్లు హాల్స్ థియేటర్లు మాల్స్ ఫుడ్ కోర్టులు అన్నీ ఓపెన్ అయ్యాయి, అయితే కేసులు కొన్ని చోట్ల వస్తున్న వేళ వీరు మాస్కులు పెట్టుకోకుండా భౌతిక దూరం లేకుండా ఇలా ఉండటం ఏమిటి అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.