చైనాలో మరో కొత్త రకం వైరస్ ఆందోళనలో మరిన్ని దేశాలు

చైనాలో మరో కొత్త రకం వైరస్ ఆందోళనలో మరిన్ని దేశాలు

0
100

కొత్త రకం వ్యాధి వైరస్ గురించి ఏదైనా వార్త వినిపిస్తే వెంటనే జనం భయపడుతున్నారు, మళ్లీ ఏ వైరస్ వచ్చి మనల్ని హరిస్తుందా అనే భయం చాలా మందిలో ఉంది, తాజాగా కరోనాతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలు పోయాయి, ఇంకా కోట్లాదిమందికి పాజిటీవ్ తో చికిత్స పొందుతున్నారు, ఇలాంటి సమయంలో మరో వైరస్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

చైనాలో మరో బ్యాక్టీరియా వెలుగులోకి వచ్చింది. దీనిని బ్రూసెల్లోసిస్ అని గుర్తించారు. గన్స్ ప్రావిన్స్ రాజధాని లాన్ ఝౌల్లో ఆరు వేల మందికి పైగా ఈ బ్యాక్టీరియా బారిన పడినట్టు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఇప్పుడు ప్రపంచదేశాలని షాక్ కి గురిచేసింది.

ఇది నేరుగా సోకే ప్రమాదం ఉందా అని తమ దేశంలో నిపుణుల ద్వారా నేతలు తెలుసుకుంటున్నారు..బయోఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నుంచి లీకేజ్ కారణంగా ఈ బ్యాక్టీరియా బయటకు వచ్చినట్లు అక్కడ వైద్యులు చెబుతున్నారు, అక్కడ నగరంలో చాలా మందికి పరీక్షలు చేశారు, అందులో 6620 మందిపై ఇది ప్రభావం చూపించింది.

ఈ బ్యాక్టీరియా సోకిన జంతువులతో ప్రత్యక్ష సంబంధాల వల్ల, కలుషితమైన జంతు ఉత్పత్తులను తినడం, తాగడం వల్ల ఈ బ్యాక్టీరియా సోకుతందని తేల్చారు, ఇది సోకిన వారికి జ్వరం ఫ్లూ లాంటి సమస్యలు వస్తాయి అని వైద్యులు తెలిపారు.