చైనాలో కరోనా టీకా వేయించుకుంటే ఆఫర్లు – అయినా నో చెబుతున్న జనం ఎందుకంటే

చైనాలో కరోనా టీకా వేయించుకుంటే ఆఫర్లు - అయినా నో చెబుతున్న జనం ఎందుకంటే

0
32

ప్రపంచంలోని అన్నీ దేశాలు కరోనాతో వణికిపోతున్నాయి, చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.. అన్నీ దేశాల్లో కరోనా టీకాలు ఇస్తున్నారు, అయితే మన దేశంలో కూడా వాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది, కొన్ని దేశాల్లో మందకొడిగా సాగుతున్నా మరికొన్ని చోట్ల లక్షలాది మంది తీసుకుంటున్నారు, ఇక మరికొందరు అసలు టీకా వేసుకోవడానికి ముందుకు రావడం లేదు.

 

చైనాలో మాత్రం కరోనా గురించి పట్టించుకోవటం మానేసినట్లుగా ఉన్నారు ప్రజలు… చాలా మంది అక్కడ కరోనాతో గత ఏడాది ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే, అక్కడ కరోనా టీకా వేసుకోవాలి అని చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు..

అక్కడ ప్రభుత్వం వాక్సిన్ వేసుకోమని ప్రోత్సహకాలు ప్రకటించింది.

 

అయినా చైనీయులు మాత్రం టీకా వేయించుకోవడానికి ముందుకురావడం లేదు. టీకా వేయించుకుంటే గుడ్లు ఫ్రీ అన్నారు అయినా ప్రజలు నో అంటున్నారు, ఇక మాల్స్ స్టోర్లులో కూపన్లు ఇస్తున్నారు ఆ కూపన్లు వద్దు అంటున్నారు జనం.

చైనాలో 19 కోట్ల మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. జనాలు ఈ వ్యాక్సిన్ ఎందుకు వద్దు అంటున్నారో తెలియడం లేదు.