చిరంజీవి మరో సంచలన నిర్ణయం

చిరంజీవి మరో సంచలన నిర్ణయం

0
74

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి హీరోనో తెలిసిందే, ముఖ్యంగా మెగా హీరోలు అందరికి దారి చూపించి టాలీవుడ్ లో ఓ సినీ ఆణిముత్యంగా హీరోగా ఎదిగారు ఆయన, ఇక సినిమాల తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఇప్పుడు సినిమాల్లో బిజీ అయ్యారు సైరా షూటింగ్ లో బీజీగా ఉన్నారు ఆయన, ఇక ఆయన తనయుడు రామ్ చరణ్ ఇటు సినిమాహీరోగా వ్యాపారవేత్తగ బిజీగా ఉన్నారు ఇటు కొణిదెల ప్రొడక్షన్ నిర్వహిస్తున్నారు రామ్ చరణ్ అయితే తాజాగా చిరంజీవి కొత్త వ్యాపారానికి నాంధి పలికారు అని తెలుస్తోంది.

చిరంజీవి ఇప్పుడు విద్యారంగంపై దృష్టి సారించారు అని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా ఉండే విద్యారంగంలో పాఠశాలను అధునాత, నూతన ఒరవడితో ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా చిరంజీవి ఇంటర్నేషనల్ పాఠశాలను ప్రారంభిస్తున్నట్లు సీఈఓ జె.శ్రీనివాసరావు ప్రకటించారు. శ్రీకాకుళం శివారులో పెద్దపాడు వద్ద పాఠశాల ఏర్పాటుకు చకచకా ముందుకు సాగుతున్నారు. గౌరవ వ్యవస్థాపకుడిగా చిరంజీవి, రామ్ చరణ్ గౌరవాధ్యక్షుడిగా, నాగబాబు చైర్మన్ గా, చిరంజీవి యువత అఖిల భారత అధ్యక్షుబు స్వామినాయుడు కన్వీనర్ గా ఈ పాఠశాల నెలకొల్పుతున్నారు. మొత్తానికి ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారట.