ఈ కరోనా సమయంలో తోపుడు బండ్లు మీద వ్యాపారం చేసుకునే వారు, చిరు వ్యాపారులకి చాలా ఇబ్బంది వచ్చింది, వారికి నాలుగు నెలలుగా ఉపాధి లేదు ఎలాంటి వ్యాపారం సాగడం లేదు, ఈ సమయంలో ఏపీ సర్కార్ వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
రోడ్ల పక్కన చిన్న వ్యాపారం చేసుకునే వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. స్ట్రీట్ వెండర్స్, సూక్ష్మ మధ్య తరగతి వారికి బ్యాంక్‌ల నుంచి లోన్లు తీసుకునే సమయంలో చెల్లించే స్టాంప్ డ్యూటీని మినహాయింపు ఇచ్చింది.
సుమారు లక్ష మందికి ఇది లబ్ది చేకూర్చనుంది..రూ.7,300 కోట్లు మేర లాభం చేకూరనుంది.3.5 లక్షల మంది స్ట్రీట్ వెండర్లకు కూడా ప్రయోజనం చేకూరుతుంది.చిరు వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు జగనన్న తోడు అనే పథకాన్ని ఏపీ ప్రభుత్వం అక్టోబర్‌లో ప్రారంభించనుంది. చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి 10 వేలు వడ్డీ లేని రుణం ఇవ్వనున్నారు, దీనికి వడ్డీ సర్కారు కడుతుంది.
అక్టోబర్‌లో ప్రభుత్వం రూ.పది వేల సాయాన్ని అందించనుంది వీరికి.