సినిమా ప‌రిశ్ర‌మ‌కు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జ‌గ‌న్

సినిమా ప‌రిశ్ర‌మ‌కు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జ‌గ‌న్

0
97

ఇక ఏపీ ప్ర‌భుత్వం చిత్ర ప‌రిశ్ర‌మ‌కు గుడ్ న్యూస్ చెప్పింది, ఇక సినిమాలు టీవీల‌కు సంబంధించి షూటింగుల ప్ర‌క్రియ‌పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాదు రాష్ట్ర సినిమా టివి, మరియు థియేటర్ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సింగిల్ విండో సిస్టం ఏర్పాటు చేసింది.

ప్రభుత్వం. నిర్మాణ సంస్థలను ప్రోత్సహించేందుకు సినీ, మరియ టెలివిజన్ రంగాలకు ఉచితంగా షూటింగ్ అనుమతులు ఇచ్చింది. అయితే గతంలో నిర్ణయించిన ఫీజుల కాషన్ డిపాజిట్లను కార్పొరేషన్ కు చెల్లించిన తరువాత షూటింగ్ ముగిసిన అనంతరం వాటిని రీఫండ్ చేస్తుంది ఏపీ ప్రభుత్వం.

ఆ ప్రాంతాల్లో షూటింగ్స్ కోసం చెలించాల్సిన కాషన్ డిపాజిట్ల ఆధారంగా వాటిని 3 కేటగిరిలుగా విడదీసింది కేట‌గిరీ1..వివిధ మ్యూజియం,బిల్డింగ్ లు,పాఠశాలలు మరియు కాలేజీలలో షూటింగ్ కు అనుమతి ఇచ్చింది తర్వాత 2. కేట‌గిరీలో దేవాల‌యాలు, జూ పార్కులు స‌ర‌స్సులు, ఉద్యాన‌వ‌నాల‌కు పాఠ‌శాల‌లు, కాలేజీల‌లో లైబ్రరీల‌లో షూటింగ్ కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది, కేట‌గిరీ 3 ఇక బీచ్ లు మున్సిప‌ల్ పార్కులు గార్డెన్స్ , పార్కుల్లో షూటింగ్ చేసుకోవ‌చ్చు…కాషన్ డిపాజిట్ వ‌రుస‌గా 15 వేలు-10 వేలు-5 వేలు గా తెలిపింది.