టిఆర్ఎస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు..తారాస్థాయికి చేరిన రాజయ్య, కడియం పంచాయితీ

0
98

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో వర్గపోరు భగ్గుమంది. స్టేషన్​ ఘన్​పూర్​లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా సీన్ మారింది. కడియం హయాంలోనే వందల ఎన్‌కౌంటర్లు జరిగాయంటూ నిన్న ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలపై కడియం శ్రీహరి ఇవాళ స్పందించారు.

చాలా సార్లు నాపై స్టెట్​మెంట్లు ఇస్తున్నారు. నేను వాటిపై ఇప్పటివరకు స్పందించలేదు. ఇప్పుడు స్పందించాల్సివస్తోంది. ఇది నా అడ్డా అని చెప్పుకుంటున్నారు. విజయావకాశాలను దృష్టిలో పెట్టుకుని అధిష్ఠానం అవకాశాలు ఇస్తుంటుంది. అంతా సరిగ్గానే ఉంటే అసలు నా వరకు ఎందుకు వస్తుంది. ఇప్పటికైనా చిల్లర మాటలు బంద్ చేయాలి. స్వచ్చంద సంస్థతో సర్వే చేయిద్దాం. ఇందుకు అవసరమైన ఖర్చు కూడా నేనే పెట్టుకుంటా. ఇందులో పార్టీతో సంబంధంలేదు. ఇద్దరమే తేల్చుకుందాం. ప్రజలు ఎవర్ని కోరుకుంటే వాళ్లే నియోజకవర్గంలో రాజకీయంగా ముందుకువెళ్దాం. నా సవాల్​కు సిద్ధమా..? నా సవాల్‌కు సిద్ధం కాకపోతే ఎక్కడైనా నా ప్రస్తావన తీసుకురావద్దని వార్నింగ్ ఇస్తున్నా అని కడియం కౌంటర్ ఇచ్చారు.