ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అలాగే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నేత పంచముర్తి అనురాధ సంచలన వ్యాఖ్యలు చేశారు…
కొద్దిరోజులక్రితం ద్వారంపూడి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే… ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు… ద్వారంపూడి జగన్ కు బినామీ అని ఆరోపించారు సాక్షి కార్యాలయాలు ద్వారంపూడి పేరుమీద ఉన్నాయని ఆరోపించారు…
ద్వారంపూడి దందాలకు అంతేలేదని ఆరోపించారు…గతంలో పేకాట క్లబ్బుల్లో ఓ మంత్రిని ద్వారంపూడి గన్ తో బెదిరించారని ఆరోపించారు…. అలాగే ఆయన తండ్రి దొంగనోట్లు ముద్రించి చలామణి చేసేవారని ఆరోపించారు అనురాధ అక్రమంగా రేషన్ బియ్యాన్ని షిప్పుల్లో ఇతర దేశాలకు తరలించేవారని ఆమె ఆరోపించారు…