సీఎం జగన్ ఎఫెక్ట్… ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ఎం చేస్తున్నారో తెలుసా…

సీఎం జగన్ ఎఫెక్ట్... ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ఎం చేస్తున్నారో తెలుసా...

0
91

ఏపీ రాజకీయాలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని వ్యక్తి జేసీ దివాకర్ రెడ్డి…. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మూడు దశాబ్దాలపాటు రాజకీయ చక్రం తిప్పారు… ఇక తెలుగు రాష్ట్ర విభజన తర్వాత జేసీ బ్రదర్స్ చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు… 2014 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా ఆయన సోదరుడు తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు…

ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వారు రాజకీయాలకు దూరమై వారసులను దింపారు… అయితే జగన్ ప్రభంజనం ముందు వారు నిలదొక్కుకోలేకపోయారు… ఇద్దరు వారసులు పోటీ చేసిన తొలిసారి ఓటమి చవి చూశారు.. ఇక ఫలితాల తర్వాత కొంత కాలంపాటు మీడియా ముందు కనిపించిన జేసీ దివాకర్ రెడ్డి ఆ తర్వాత ఆయన సోదరుడు పై పలు కేసులు నమోదు అయ్యారు..

ఇక అప్పటి నుంచి దివాకర్ రెడ్డి ప్రత్యక్షరాజకీయాలకు దూరంగా ఉంటున్నారు… తన సొంత గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో ప్రశాంత జీవితాన్ని గడుపున్నారు… అనుచరులు ఏవరైనా ఆయన్ను కలిసి రావాలనుకుంటే ఫోలాని వెళ్లి కలిసి రావచ్చట… ఏది ఏమైనా ఒక పవర్ ఫుల్ పోలిటికల్ లీడర్ ఇలా సైలెంట్ గా ఉండటాన్ని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది…