విశాఖ టీడీపీ నేతలు వనికిపోతున్నారా అంటే అవుననే ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఏ రోజు తెల్లారితే ఏం జరుగుతుందోనని కలవరం చెందుతున్నారట…రోజుకు ఒక చోట అక్రమాల తొలగింపు వ్యవహారం సాగుతుండటం వారిని చిక్కుల్లో నెడుతోంది…
ఎవరికి ఎప్పుడు చుక్కలు చూపిస్తారనే టెన్షన్ పుట్టిస్తోంది… జీవీఎంసీ అధికారుల యాక్షన్ కు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియకసతమతమవుతున్నారట తమ్ముళ్లు..ఇప్పటికే మాజీ ఎంపీ సబ్బం హరి అక్రమాలను తొలగించిన సంగతి తెలసిందే.. ఆ తర్వాత ఆయన మౌనం పాటించారు…
దాని తర్వాత గీతం యూనివర్సిటీ వ్యవహారంలో తత్కాలికంగా స్టేవచ్చినా అనేక అనుమతుల విషయంలో వైసీపీ నేతలు చూపిస్తున్న ఫిర్యాదులు ఆ సంస్థ యాజమాన్యాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి… ఇక తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు అక్రమాలను తొలగించినా కూడా ఆయన పెదవి విప్పలేదు.. ఇక నెక్ట్స్ ఎవరు అన్నది విశాఖ టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకొందట…