వైసిపి నాయకులపై సీఎం జగన్ ఫైర్..

0
120

నెల్లూరు వైసిపి రాజకీయాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ రెండు మంత్రి పదవులు దక్కించుకున్న కానీ..అక్కడ ఎప్పటికి నేతల మధ్య విభేదాలు..ఆధిప్యత పోరులు నిత్యం జరుగుతూనే ఉంటాయి. బహిరంగ విమర్శల కూడా చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

తాజాగా నెల్లూరు వైసిపి నాయకులపై సీఎం జగన్‌ తీవ్ర స్థాయిలో మండిపడినట్టు తెలుస్తుంది. నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి , మాజీ మంత్రి అనిల్ ఒకరిపై ఒకరు పోటీ పాడుకుంటూ సభలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులో వాహనాలతో భారీ ర్యాలీ కసరత్తు చేస్తున్నాడు కాకాణి. కాకానికి పోటీ పడుతూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో గాంధీ సర్కిల్ వద్ద బహిరంగ సభకు  అన్ని ఎర్పాట్లు చేసి నిర్వహించబోతున్నారు.

ఓకే సమయంలో ఇరువురి నేతలు కార్యక్రమాలకు బందోబస్తులు ఏర్పాటు చేసారు. అయితే ఈ నేపథ్యంలో..నెల్లూరు రాజకీయాలపై ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నెల్లూరు వైసీపీ నాయకులపై సీరియస్‌ అయినట్లు సమాచారం అందుతోంది. విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని కూడా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారట.