ఏపీ రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..వారందరికీ రూ.30 వేలు

0
104

ఏపీ రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూరైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో 30 వేల మెగావాట్లకు పైగా గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి అపార అవకాశాలు ఉన్నాయని..దీని కోసం సుమారు 90 వేల ఎకరాలు అవసరమని చెప్పారు.

గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల వల్ల రైతులకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని.. ప్రతి ఎకరాకు రైతుకు కనీసంగా రూ.30 వేల లీజు వస్తుందని ప్రకటించారు. దీంతో రైతులకు మేలు జరుగుతుందని ఆయన ఉద్గాటించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కంపెనీల తయారీ కేంద్రంగా రాష్ట్రం మారాలన్నారు.

గ్లోబల్‌ కంపెనీల పెట్టుబడులు తీసుకురావడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఎలక్ట్రానిక్స్‌, పర్యాటక– ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని.. కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ పరిశ్రమలు విరివిగా వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.