ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్

0
94

ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దీనితో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. జగనన్న విద్యాదీవెన, జగనన్న అమ్మఒడి, విద్యాకానుక , వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాలతో ప్రజలు లబ్ది పొందుతున్నారు.

ఇక తాజాగా రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి నెలా ఇచ్చే రేషన్ కి అదనంగా ఈ కేంద్రం ఇచ్చే కార్డుల బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు తొలగించ లేదని తెలిపారు. కొత్తగా ఏడు లక్షల కార్డులు మంజూరు చేసుకున్నామని, ప్రతినెలా ఇచ్చే రేషన్ కి అదనంగా కేంద్రం ఇచ్చే రేషన్ ఇస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలియజేశారు.

కరోనా సమయంలో కోటి 46 లక్షల కార్డులు ఉంటే.. కేంద్రం 89 లక్షలకు మాత్రమే బియ్యం ఇచ్చిందని అన్నారు. కేంద్రం ఇచ్చే 89 లక్షల కార్డులకి బియ్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 9 వెనుకబడిన జిల్లాలు ఎస్సీ, ఎస్టీలు అందరికీ ఉచిత రేషన్ పథకాన్ని అమలు చేస్తామన్నారు.