సీఎం జగన్ కు అభినందనలు- విజయశాంతి

సీఎం జగన్ కు అభినందనలు- విజయశాంతి

0
92

దిషపై జరిగిన అత్యాచార ఘటనలో యావత్ దేశం ఆ దుర్మార్గులని ఉరి తీయాలి అని కోరుకున్నారు. చివరకు ఎన్ కౌంటర్లో చనిపోయారు., ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఘటన గురించి సీఎం జగన్ మాట్లాడారు, ఈ ఘటనని ఖండించారాయన. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో కొత్త చట్టం తీసుకురావాలని జగన్ ప్రకటించారు.

అయితే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పై ..తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్, ప్రముఖ సినీ నటి విజయశాంతి హర్షం వ్యక్తం చేశారు.. కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్టు ప్రకటించిన జగన్ కు తన అభినందనలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. అయితే మహిళల కోసం చట్టాల్లో మార్పు తేవాలని, ఏపీ తెలంగాణలో ఒకేలా చట్టాలు తీసుకువస్తే మంచిది అని ఆమె తన అభిప్రాయం చెప్పారు.

ఇలాంటి ఘటనలు జరుగకుండా ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తున్నామని, ఆడవారిపై నెగెటివ్ పోస్టింగ్స్ చేసే వారికి శిక్ష పడేలా చట్టాల్లో మార్పులు తీసుకొస్తామని, సెక్షన్ 354 ఈ ని ప్రవేశపెట్టే ఆలోచనలు చేస్తున్నట్టు జగన్ ప్రకటించారు. మొత్తానికి ఏపీలో జగన్ ఈ నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో కూడా కొత్త చట్టం తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.