సీఎం జగన్ కు జనసేన డెడ్ లైన్..

సీఎం జగన్ కు జనసేన డెడ్ లైన్..

0
97

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనసేన పార్టీ డెడ్ లైన్ విధించింది… ఉగాది పండుగ నుంచి జనసేన అలాగే తెలుగుదేశం పార్టీలు ప్రజా సమస్యలపై పోరాడుతాయని మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ అన్నారు…

తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ రాష్ట్ర ప్రయోజనాలకోసమే తాము బీజేపీలో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు… వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక్క అభివృద్ది కార్యక్రమం కూడా జరుగలేదని ఆరోపించారు మనోహర్… రివర్స్ టెండర్లతో వైసీపీ నాయకులు అభివృద్దిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు…

గత ప్రభుత్వం చేసిన తప్పులే ఇప్పుడు వైసీపీ సర్కార్ కూడా చేస్తోందని ఆరోపించారు… ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు మార్చుతూ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు…