సీఎం జగన్ కు కంటిమీద కునుకు లేకుండా చేసేందుకు చంద్రబాబు బిగ్ ప్లాన్…

సీఎం జగన్ కు కంటిమీద కునుకు లేకుండా చేసేందుకు చంద్రబాబు బిగ్ ప్లాన్...

0
96

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటిమీద కునుకు లేకుండా చేసేందుకు బిగ్ ప్లాన్ వేశారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ఇప్పటికే సర్కార్ పేదలకు ఐదు వేలు ఇవ్వనందుకు అలాగే వలసకూలీలను పట్టించుకోనందుకు, రైతుల పంటల కొనుగోలు చేయనందు నియోజవర్గాల్లో టీడీపీ నేతలు 12 గంటల పాటు దీక్షలు చేశారు…

ఇక మండల స్ధాయి దీక్షలు చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.. వైసీపీ నేతల వల్ల కరోనా వైరస్ సోకిందనే ప్రచారాన్ని క్షేత్ర స్థాయిలో తీసుకువెళ్లాలని అధిష్టానం యోచిస్తోందట… ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ దీక్షలు చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు… దీంతో మండల స్థాయి నేతలు 12 గంటల పాటు దీక్షలు చేస్తున్నారు…

అయితే ఇప్పట్లో లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితి లేదు… ఇక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి రాకపోకలు సాగవు… దీంతో మరికొంత కాలం చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండే పరిస్థితి… దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తన నివాసంలో దీక్షకు దిగాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం… హైదరాబాద్ లో తన నివాసంలో దీక్ష చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది… మొత్తంమీ చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి సర్కార్ కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారని కొందరు అంటున్నారు…