సీఎం జగన్ కు లోకేశ్ రెండు ఆప్షన్స్

సీఎం జగన్ కు లోకేశ్ రెండు ఆప్షన్స్

0
110

నాన్నగారిని, నన్ను అడ్డుకోడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పడుతున్న కష్టంలో పది శాతం రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడినా రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఉండేవి కావని లోకేశ్ అన్నారు. కక్ష సాధింపే లక్ష్యంగా,రౌడీయిజమే ఊపిరిగా ముందుకి వెళ్ళాలి అనుకుంటే మీ ఇష్టం జగన్ అని అన్నారు. కానీ మీడియా ప్రతినిధులేం చేసారని ప్రశ్నించారు

తమను అడ్డుకొనే పనిలో భాగంగా వైసీపీ రౌడీలు మీడియా ప్రతినిధుల పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తన ప్రజా చైతన్యయాత్ర కవరేజ్ కి వచ్చి వెళ్తున్న మీడియా ప్రతినిధుల పై విచక్షణారహితంగా దాడి చేసి, జర్నలిస్టు మిత్రుల కాలు విరగొట్టిన ఘటన తనను తీవ్రంగా బాధించిందని అన్నారు..

ఇదేనా మీరు తెస్తానన్న రాక్షస రాజ్యం అని ప్రశ్నించారు. వైసీపీ దాడిలో గాయపడిన ముగ్గురు జర్నలిస్టు మిత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు…