సీఎం జగన్ కు నాగబాబు అతి పెద్ద సలహ

సీఎం జగన్ కు నాగబాబు అతి పెద్ద సలహ

0
91

ఓపక్క పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరపున సీఎం జగన్ పై విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు.. మరో పక్క వైసీపీ నేతలు పవన్ ని టార్గెట్ చేస్తున్నారు, ఈ సమయంలో జనసేన పార్టీ నాయకుడు నాగబాబు కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.. పలు అంశాలపై ట్వీట్లు పెడుతున్నారు. తాజాగా విజయసాయిరెడ్డికి నాగబాబుకి మధ్య జీరో విషయంలో విమర్శలు ఆరోపణలు ట్వీట్ల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇరువురు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

తాజాగా నాగబాబు సీఎం జగన్ కు ఓ అభ్యర్దన చేశారు.. డియర్ జగన్ రెడ్డి గారూ ఇది నా అభ్యర్థన అంటూ జనసేన నేత నాగబాబు ట్వీట్లు చేశారు. దయచేసి మీ తప్పులను సరిదిద్దుకుని, మిగిలిన నాలుగున్నరేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించండి. మీకు అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని మీరు అనుకుంటే రాష్ట్ర ప్రజలతో గొడవ పెట్టుకోకండి, గందరగోళానికి గురవ్వకండి అని ట్వీటెట్టారు.

అంతేకాదు మీ తప్పులను సరిదిద్దుకోవడానికి మీకు ఇప్పటికీ సమయం ఉంది మీకు ఇంకా పరిపాలనకు సమయం ఉంది. మీరు తప్పులు చేయాలని మేము కోరుకోము. మీరు చేసే తప్పుల ఆధారంగా రాజకీయ ప్రయోజనాలు పొందాలని మేము అనుకోము. ఇటువంటి ఆలోచనలు జనసేన పార్టీకి లేవు. మీ ఎమ్మెల్యేలను నియంత్రణలో పెట్టుకోండి.. మీ విక్టరీని వారు నాశనం చేస్తారు. మీ నిర్ణయాలను విమర్శించే అవకాశాన్ని మాకు ఇవ్వకండి. స్టేట్ లో ఉన్న ప్రజలు అందరిని ఒకేలా చూడండి అని ట్వీట్ పెట్టారు, మరి దీనిపై ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.