సీఎం జగన్ కు నోబుల్ బహుమతి…

సీఎం జగన్ కు నోబుల్ బహుమతి...

0
84

రాష్ట్ర ప్రజలు చచ్చినా తాను రాజకీయ లబ్ది పొందాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆరోపించారు తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ ఒక శాస్త్రవేత్త అన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు…

కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు పారాసెటిమాల్ వేసుకుంటే సరిపోతుందని అన్నారని ఆరోపించారు… అందుకే ఆయనకు నోబుల్ బహుమతి ఇవ్వాలని అన్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి… కరోనా వ్యాపించడంతో ప్రజల ఆరోగ్య దృష్ట్య ఎన్నికల కమిషన్ ఎన్నికలను వాయిదా వేసిందని అన్నారు…

ఇటీవలే సీఎం జగన్ మాట్లాడిన మాటలను హ్యూమన్ రైట్స్, విదేశీ ఆరోగ్య సంస్థలకు, రాష్ట్రపతి, గవర్నర్ లకు పంపిస్తామని అన్నారు… కాగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే…