సీఎం జగన్ కాళ్లు పట్టుకుని పార్టీలో చేరి బతికి పోయావు… వైసీపీ నేతల మధ్య వార్…

సీఎం జగన్ కాళ్లు పట్టుకుని పార్టీలో చేరి బతికి పోయావు... వైసీపీ నేతల మధ్య వార్...

0
107

ప్రకాశం జిల్లా చీరా సెగ్మెంట్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి… మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11 వర్ధంతి నేడు… రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహానికి పార్టీ నేతలు పూల మాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు… ప్రకాశం జిల్లా చీరాలలో కూడా వైఎస్ విగ్రహం వద్ద పార్టీ నేతలు శ్రద్దాంజలి తెలిపే క్రమంలో నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది…

మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గీల మధ్య అలాగే ఎమ్మెల్యే కరణం బలరాం వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.. అయితే సమయానికి పోలీసులు అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి సర్దుమనిగింది… ఈక్రమంలో బలరాం తనయుడు కరణం వెంకటేష్ మాట్లాడుతూ చీరాలకు స్వేచ్చను ఇస్తామని వాగ్దానం చేశామని ఇక్కడ గతంలో మాదిరి దౌర్జన్యాలు బెధిరింపులు పాల్పడాలంటే కుదరదని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు…

ఇక దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి తన పేరు ఉచ్చరించకుండా భయపడేవాడు కూడా తనకు వార్నింగ్ ఇస్తారా అని అంటూ మండిపడ్డారు… సీఎం జగన్ కాళ్లు పట్టుకుని బతికిపోయారని ఆరోపించారు.. అధికారం లేకుండా ఎక్కడా బతకలేని వాళ్లు తన గురించి మాట్లాడతారా అని ఫైర్ అయ్యారు…