సీఎం జగన్ ను కడిగిపారేసిన జేసీ….

సీఎం జగన్ ను కడిగిపారేసిన జేసీ....

0
78

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ జేపీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… దేశం మొత్తాన్ని గజగజవణికిస్తున్న కరోనా వైరస్ ఎక్కువగా పేద ప్రజలపై ప్రభావం చూపుతుందని అన్నారు…

కానీ వారికి ప్రభుత్వం 1000 రూపాయలు ఇచ్చినంత మాత్రానా ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు… పదిరోజులు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తే ప్రజలను ఆదుకున్న వారవుతారా అని ప్రశ్నించారు… రోడ్ల మీద బ్లీచింగ్ పౌడర్ వేసినంత మాత్రాన వ్యాధిని అరికట్టలేమన్నారు…

లాక్ డౌన్ చేయడం వలన పరిశ్రమలు మూత పడటంతో కార్మికులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. అలాగే జనతా కర్ఫ్యూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం అభినందనీయం అని అన్నారు జేసీ…