సీఎం జగన్ ను రిక్వెస్ట్ చేసిన లోకేశ్…

సీఎం జగన్ ను రిక్వెస్ట్ చేసిన లోకేశ్...

0
86

రైతులను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం అంటోంది. కానీ క్షేత్రస్థాయిలో రైతులు కన్నీరు పెడుతున్నారని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు…. రైతులు అప్పులు చేసి పండించిన పంటకి మద్దతు ధర రావడం లేదని మండిపడ్డారు… కనీసం వేరే ప్రాంతాలకు తరలించడానికి రవాణా సౌకర్యం కూడా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని లోకేశ్ ఆరోపించారు…

అలాగే హార్టీ కల్చర్, ఆక్వా రంగంలో ఉన్న రైతుల కష్టాలు వర్ణనాతీతం అని అన్నారు. కూలీలు, గిట్టుబాటు ధర లేక వరి పండించిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు లోకేశ్…

ఒక్క సారి రైతు దెబ్బ తింటే కోలుకోవడం చాలా కష్టం అని లోకేశ్ అన్నారు… వీలైనంత త్వరగా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామని లోకేశ్ అన్నారు…