సీఎం జగన్ పై పోసాని ఆసక్తికర కామెంట్స్

సీఎం జగన్ పై పోసాని ఆసక్తికర కామెంట్స్

0
91

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హాస్యనటుడు పోసాని కృష్ణమురళి మరోసారి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… తాను జగన్ మోహన్ రెడ్డిపై అలగడం కానీ తనమీద జగన్ అలగడం కానీ ఈ జన్మలో జరగని పని అని అన్నారు…

తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… తనకు పదవులంటే ఆశలేదని సేవ చేయడానికి తాను ఎప్పుడు సిద్దమేనని అన్నారు.. జగన్ మోహన్ రెడ్డికి కులగజ్జి అస్సలు లేదని తెలుసుకున్న తర్వాత ఆయనకు సపోర్ట్ చేశానని అన్నారు…

ఎన్నికల ముందు తాను ఒక్కసారి జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేయమని చెప్పానని ఆయన సీఎం అయ్యాక ప్రజలే ప్రతీ సారి ఆయనకు ఓటు వేస్తారని చెప్పానని అన్నారు….. కొన్నినెలల కిందట కూడా తనకు పదవి విషయంలో సంప్రదించారని తాను అందుకు అంగీకరించలేదని స్పష్టం చేశారు…