సీఎం జగన్ రాజీనామా

సీఎం జగన్ రాజీనామా

0
99

సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు… జగన్ రాజ్యసభ సీటును 200 కోట్లకు బయటి రాష్ట్రానికి చెందిన వ్యక్తికి అమ్ముకున్నారని ఆరోపించారు… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

తన తండ్రి వైఎస్ మరణానికి కారణం రిలయన్స్ అని చెప్పిన జగన్ ఇప్పుడు అదే సంస్థకు చెందిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఎలా కేటాయిస్తారని ఉమా ఆరోపించారు… స్థానికి సంస్థల ఎన్నికల్లో 90 శాతం పైగా అభ్యర్ధులను గెలిపించకపోతే మంత్రులంతా రాజీనామా చేయాలని బెధిరించారని ఆరోపించారు…

అయితే ఓటర్లంతా టీడీపీకి ఓట్లు వేస్తే ఈ నెలాఖరుకి జగన్ రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా చేస్తారని ఉమా అన్నారు… రాజధాని ప్రాంతాల్లో వివిధ సాకులు చూపి స్థానిక ఎన్నికలు జరుగకుండా కుట్రలు పడుతోందని ఆరోపించారు ఉమా..