సీఎం జగన్ షాకింగ్ డెసిషన్ ? 40 రోజుల తర్వాత మంచిదే

సీఎం జగన్ షాకింగ్ డెసిషన్ ? 40 రోజుల తర్వాత మంచిదే

0
94

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందు నుంచి మద్యం విషయంలో, ఐదేళ్లలో క్రమంగా మద్యపాన నిషేధం అమలు చేసే దిశగానే చూస్తున్నారు, తాజాగా లాక్ డౌన్ 40 రోజులుగా ఉంది, ఈ సమయంలో మద్యం దుకాణాలు తెరచుకోలేదు, కాని తాజాగా సీఎం జగన్ ఏపీలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అంతేకాదు ఈ సమయంలో మద్యం ధరలను 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్ . మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా, దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు ఉంటాయి. ఇక లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత క్రమంగా మద్యం దుకాణాలు కూడా తగ్గిస్తారట.

ఈ నెల 4 నుంచి మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. కోవిడ్ కంటైన్మెంట్ ఏరియాలు లేని గ్రీన్, ఆరెంజ్ జోన్లతోపాటు రెడ్ జోన్లలోనూ మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఇక కచ్చితంగా ఈ ప్రాంతాలలో మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించి మద్యం తీసుకోవాలి, అలాగే షాపుదగ్గర ఐదుగురికి మించి ఉండకూడదు.