సీఎం జగన్ వారికి నో అపాయింట్ మెంట్

సీఎం జగన్ వారికి నో అపాయింట్ మెంట్

0
87

ఏపీ సచివాలయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి…. ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సచివాలయాన్ని విశాఖకు అలాగే కర్నూల్ జిల్లాకు హైకోర్టు అలాగే లెజిస్లెటివ్ క్యాపిటల్ అమరావతిలో ఉండవచ్చని ప్రకటించారు….

అయితే ముఖ్యంగా సచివాలయాన్ని తరలించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి… కొంతమంది విశాఖకు తరలించడాన్ని స్వాగతిస్తున్నా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు… అందుకే ఇదే విషయమై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి…

ప్రధానంగా హైదరాబాద్ నుంచి వెళ్లే సచివాలయ ఉద్యోగులు మాత్రం విశాఖకు సచివాలయ తరలింపును వ్యతిరేకిస్తున్నారు… ఈ విషయంమై జగన్ తో చర్చించాలని చూస్తున్నారు… అయితే వారికి ఇంతవరకు జగన్ మోహన్ రెడ్డి కలవడానికి అపాయింట్ ఖరారు కాలేదు…