సీఎం ఖాతాలో మరో కొత్త రికార్డ్

సీఎం ఖాతాలో మరో కొత్త రికార్డ్

0
90

ప్రస్తుతం ఉన్న ఏపీ పరిస్థితిలో వికేంద్రీకరణ దిశగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు… శీతాకాల సమావేశంలో రాజధానిపై చర్చరిగింది… ఈ చర్చలో జగన్ మాట్లాడుతూ…. సౌత్ ఆఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని అన్నారు…

బహుషా ఏపీలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో అంటూ ప్రసంగించారు… అమరావతిలో లెజిస్లేటర్ క్యాపిటల్ రావచ్చు, విశాఖ పట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావచ్చు, కర్నూల్ జిల్లాలో జుడిషియల్ క్యాపిటల్ రావచ్చని జగన్ అన్నారు…

రాజధానిపై ఒక కమిటి వేశామని ఆ కమిటీ రాష్ట్ర మంతా తిరిగి ప్రజాభిప్రాయాన్ని సేకరించే పనిలో ఉందని మరో రెండు మూడు రోజుల్లో కమిటీ నివేదిక సమర్పిస్తుందని కమిటీ తెలిపిన నిర్ణయం మేరకే ముందడుగులు వేస్తామని అన్నారు… పిల్లల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని మంచి నిర్ణయం తీసుకుంటాని అన్నారు…