సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో దళితబంధుపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం అందజేస్తున్న వంద మందితో పాటు ప్రతి నియోజకవర్గంలో మరో 500 మందికి విస్తరించాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. గుర్తింపు ప్రక్రియను త్వరగా ముగించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.