ఫ్లాష్- ఆ మాట వినపడకూడదు..సీఎం కేసీఆర్‌ సంచలన ఆదేశాలు

0
75

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ‘రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినపడకుండా చూడాలి. డ్రగ్స్ కేసులో దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దోషులు ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలి. కఠిన చర్యల అమలు కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి. నార్కోటిక్, ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేయాలి. వెయ్యి మందితో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్​కు ప్రత్యేక విధులు నిర్వర్తించాలి. డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలను కఠినంగా నియంత్రించాలని కేసీఆర్ ఆదేశించారు.